సింగపూర్లో ఏపీ మంత్రి నారాయణ (Narayana) పర్యటన కొనసాగుతోంది. ఆ దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలు, స్వీపింగ్ మెషీన్లను మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు.
సింగపూర్ అధికారులు ఘన వ్యర్థాల నిర్వహణపై వివరించారు. ఇళ్లలో చెత్త సేకరణ చేయడం నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ వరకు తీసుకుంటున్న చర్యలను మంత్రి అధ్యయనం చేశారు. గ్రీనరీ నిర్వహణ కోసం ఉపయోగిస్తున్న అధునాతన ట్యాంకర్లను ఆయన పరిశీలించారు.
మధ్యాహ్నం సింగపూర్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను మంత్రి పరిశీలించనున్నారు. ఏపీలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సింగపూర్ తరహాలో ఇళ్ల వద్ద నుంచి చెత్త సేకరణ చేసే విధానంపై ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.