మన శరీరంలో కిడ్నీలు చిన్నవైనా, వాటి పనితీరు చాలా గొప్పది. రక్తాన్ని శుద్ధి చేయడం, టాక్సిన్స్ బయటకు పంపించడం, బీపీ కంట్రోల్ చేయడం, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి సహకరించడం ఇలా ఎన్నో ముఖ్యమైన పనులు కిడ్నీలు చేస్తాయి.
కాబట్టి వాటి ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. ఎక్కువ ఉప్పు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్, తక్కువ నీరు తీసుకోవడం వంటివి కిడ్నీలపై బరువును పెంచుతాయి. అయితే కొన్ని సహజమైన పానీయాలు కిడ్నీలకు మిత్రుల్లా పనిచేస్తాయి. ఎంత చెప్పినా తక్కువే! రోజుకు సరిపడా నీరు తాగడం కిడ్నీలకు పెద్ద రక్షణ. ఇది టాక్సిన్స్‌ను బయటికి పంపడంలో, యూరిన్ ద్వారా ఉప్పు, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
నిమ్మరసం కేవలం రిఫ్రెష్ కాకుండా, సిట్రిక్ యాసిడ్‌ను అందిస్తుంది. ఇది మూత్రపిండ రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) వచ్చే వారికి క్రాన్‌బెర్రీ జ్యూస్ చాలా ఉపయోగం. ఇది బ్యాక్టీరియా మూత్రనాళానికి అంటకుండా అడ్డుకుంటుంది. కానీ 100% నేచురల్, షుగర్ ఫ్రీ జ్యూస్ మాత్రమే ఎంచుకోవాలి.
పెప్పర్‌మింట్, జింజర్, చామొమైల్, హిబిస్కస్ టీలు కిడ్నీలకు మిత్రులు. ఇవి హైడ్రేట్ చేయడమే కాకుండా ఆంటీఆక్సిడెంట్లు అందిస్తాయి. గ్రీన్ టీ అయితే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కావలసిన వారు అన్స్వీటెన్డ్ ఆల్మండ్, ఓట్స్ లేదా కొబ్బరి పాలు తీసుకోవచ్చు. వీటిలో పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్నీ హెల్త్‌కి మంచివి. నీటిలో కీర, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పుదీనా వేసి తాగితే రుచిగా ఉంటుంది. దీంతో నీరు తాగే అలవాటు కూడా పెరుగుతుంది.
అనాసపండు, యాపిల్, స్ట్రాబెర్రీ, క్యారెట్ వంటి తక్కువ పొటాషియం ఫలాలు, కూరగాయలు కలిపి స్మూతీగా తీసుకోవచ్చు. కానీ అరటిపండు మాత్రం పొటాషియం ఎక్కువగా ఉండటంతో దూరంగా పెట్టాలి. కొబ్బరి నీరు సహజ ఎలెక్ట్రోలైట్ డ్రింక్. కానీ పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల, కిడ్నీ సమస్యలు ఉన్న వారు డాక్టర్ సలహాతోనే తాగాలి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది కిడ్నీలను శుభ్రం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కానీ ఎప్పుడూ తాజాగా పిండిన రసం మాత్రమే తాగాలి.
విటమిన్ C, D ఎక్కువగా తీసుకోవడం, క్రియేటిన్, స్ట్రాంగ్ ప్రోటీన్ పౌడర్లు వంటివి కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతాయి. అలాగే కొన్ని హర్భల్ సప్లిమెంట్స్ (లికరైస్ రూట్, సెయింట్ జాన్స్ వోర్ట్) హానికరం కావచ్చు.
అలసట, బలహీనత కాళ్లు, చేతులు ఉబ్బడం, ఫోమీ యూరిన్, రక్తం కలిసిన మూత్రం, ఆకలి తగ్గిపోవడం, నోరులో లోహం వాసన, బీపీ పెరగడం, కండరాల పట్టేయడం, ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
కుటుంబ చరిత్ర
వయసు 60 దాటడం
ఎక్కువ ఉప్పు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తినడం
పొగ త్రాగడం, ఊబకాయం
కొన్ని మందుల అధిక వాడకం
కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు