ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఇటీవల కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)–క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28తో ముగిసింది.
అయితే, దరఖాస్తు సమయంలో ఏవైనా వివరాలు పొరపాటున తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులకు ఐబీపీఎస్ మరో అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2 నుంచి 3వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్‌లో తప్పులు సవరించుకోవచ్చు.
తర్వాత త్వరలోనే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరగనుంది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 29న జరిగే మెయిన్స్ రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.