అమెరికా పౌరసత్వం కోసం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్ ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసినవారికి అమెరికా పౌరసత్వం అందించనున్నారు. గోల్డ్ కార్డు ఖరీదు 5 మిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే.. మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.41.7 కోట్లు ఉంటుంది. ఈ గోల్డ్ ట్రంప్ కార్డుకు సంబంధించి వెయిటింగ్ లిస్ట్ కూడా ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గోల్డ్ కార్డును విదేశీయులకు విక్రయించగా వచ్చిన డబ్బులతో అమెరికా అప్పుల భారాన్ని దించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు కొత్త గోల్డ్ కార్డ్ వెబ్‌సైట్ ద్వారా అమెరికా పౌరసత్వం కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి? ఎవరు అర్హులు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 5 మిలియన్ డాలర్లు పెట్టుబడితో ట్రంప్ గోల్డ్ కార్డ్ వస్తోంది అంటూ ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అమెరికా పౌరసత్వం కోసం వేలాది మంది కాల్ చేసి ఎలా సైన్ అప్ చేసుకోవాలో అడుగుతున్నారని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
ఇందులో భాగంగానే గోల్డ్ కార్డ్ వెబ్‌సైట్ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ కొత్త వెబ్‌సైట్లో పేర్లను మాత్రమే రిజిస్టర్ చేసుకునే వీలుంది. అంతేకాదు.. ఈ గోల్డ్ కార్డుపై ట్రంప్ ఫోటో, సైన్, పేరుతో ఫుల్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇంతకీ గోల్డ్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం..
ట్రంప్ గోల్డ్ కార్డు (https://trumpcard.gov/) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
వెబ్‌సైట్ ఓపెన్ చేశాక క్రిందికి స్క్రోల్ చేయండి.
దరఖాస్తుదారుడి పేరు, ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఇ-మెయిల్ ఐడీని కూడా ఎంటర్ చేయాలి.
ట్రంప్ కార్డు ఎందుకోసం అప్లయ్ చేస్తున్నారో కూడా వివరణ ఇవ్వాలి.
జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు లేదా ఇతర వ్యక్తుల కోసమా? అనే వ్యక్తిగత వివరాలను ఇవ్వాలి.
వ్యక్తిగతమా లేదా బిజినెస్ కోసమా అనే వివరాలు కూడా తెలియజేయాలి.
మొత్తం 8 ప్రాంతాల నుంచి ఈ ట్రంప్ కార్డు కోసం కొత్త అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.
ఇది కూడా చదవండి: ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
యూరప్, ఆసియా (మధ్యప్రాచ్యంతో సహా), ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా ప్రాంతాల వారు అప్లయ్ చేసుకోవచ్చు.
మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక వెబ్‌సైట్ కొత్త వెబ్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. మీ మెయిల్ ఐడీకి OTP వస్తుంది.
అధికారిక వెబ్‌సైట్‌లో OTP ఎంటర్ చేసి Submit చేయండి.
6-అంకెల OTP నంబర్‌ను ఎంటర్ చేయండి.
దరఖాస్తుదారుడికి “మీ జర్నీ ప్రారంభమవుతుంది” అని మెసేజ్ అందుకుంటారు.
మీరు వెబ్‌సైట్ విజిట్ చేయగానే “గోల్డ్ కార్డ్” కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎలాంటి నిబంధనలు, షరతులు అవసరం లేదు. కానీ, గతంలో, ట్రంప్ కార్డు కోసం అర్హత కలిగిన EB-5 పెట్టుబడిదారు వీసా ప్రొగ్రామ్ తప్పక కలిగి ఉండాలి. ఈ ప్రొగ్రామ్ ద్వారా యూఎస్ ఉద్యోగాల ప్రాజెక్టులలో 8 లక్షల డాలర్ల నుంచి 1.05 మిలియన్ డాలర్ల మధ్య పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డులను మంజూరు చేశారు. అయితే, EB-5 ప్రొగ్రామ్ విధానంపై పెండింగ్‌లు, మోసపూరిత ఆరోపణలు వస్తున్నాయి. “ఈ కార్డును కొనుగోలు ద్వారా ధనవంతులు అమెరికాలోకి వస్తారు.. చాలామందికి ఉపాధి కల్పిస్తారు. పన్నులు చెల్లిస్తారు” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: