ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్‌పై ధ్వజమెత్తారు. జగన్ చేసిన ఆరోపణలపై సవాల్ విసిరితే స్పందన కరవైందని, ఇది ఆయన వైఖరికి నిదర్శనమని లోకేశ్ వ్యాఖ్యానించారు. "సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్!" అంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం జగన్ గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా... న్యాయ సమరమా? తేల్చుకోండి" అంటూ జగన్ కు లోకేశ్ అల్టిమేటమ్ జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు, మిగతా రూ.2 వేలు పాఠశాలలు/కాలేజీల అభివృద్ధి నిధుల నిమిత్తం ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే, ఈ రూ.2 వేలు మంత్రి నారా లోకేశ్ జేబులోకి పోతున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేశ్ సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: