డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్‌ను తమ వ్యాపార విస్తరణకు ముఖ్యమైన గమ్యస్థానంగా ఎంచుకుంది. ఇప్పటికే ముంబై, పూణే, కోల్‌కతా, గురుగ్రామ్‌లలో ఏడు ప్రాజెక్టుల ద్వారా భారీగా ఆదాయం సాధించిన సంస్థ, తాజాగా హైదరాబాద్ సహా ఆరు ప్రధాన నగరాల్లో కొత్త projects ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 8 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.
2024లో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ట్రంప్ భారత్‌లో వ్యాపార విస్తరణకు మరింత ఆసక్తి చూపించారు. ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి పూణే, గురుగ్రామ్, హైదరాబాద్‌లలో 4.3 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కొత్త ప్రాజెక్టుల విలువ కనీసం రూ.15,000 కోట్లు ఉండొచ్చని అంచనా. సంస్థ branding ద్వారా మాత్రమే ఆదాయం పొందుతూ, నిర్మాణాలకు డైరెక్ట్ పెట్టుబడి పెట్టడం లేదు. ట్రంప్ బ్రాండ్ పేరుతో డెవలప్‌మెంట్ ఫీజులు, లైసెన్సింగ్ ద్వారా ఆదాయం సాధిస్తోంది.
భారత్‌లో ఇప్పటికే 11 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తి చేసిన ట్రంప్ సంస్థ, ట్రైబెకా భాగస్వామ్యంతో మున్ముందు మరిన్ని ప్రాజెక్టులకు రంగం సిద్ధం చేస్తోంది. కల్పేష్ మెహతా నేతృత్వంలోని ట్రైబెకా, అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ను వార్టన్ స్కూల్ పరిచయం ద్వారా కలిసిన విషయాన్ని కూడా ప్రస్తావించటం విశేషం. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ట్రంప్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది.