లేడీ సూపర్ స్టార్ నయనతార సినీరంగంలో 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 2003లో మలయాళ చిత్రం మనసినక్కరే తో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత తమిళంలో ‘అయ్యా’, ‘చంద్రముఖి’ వంటి సినిమాలతో భారీ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వెంకటేష్ సరసన ‘లక్ష్మీ’, నాగార్జునతో ‘బాస్’, ప్రభాస్‌తో ‘యోగి’, రవితేజతో ‘దుబాయ్ శీను’, బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం’ లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. సీత పాత్రకు ఆమె award కూడా అందుకుంది.
నయనతార వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారాలు పలు చర్చలకు దారితీశాయి. శింబు, ప్రభుదేవా వంటి ప్రముఖులతో ఆమె పేరు కలిపి వినిపించింది. అయితే ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్లిన ఈ సంబంధం చివరికి విఫలమైంది. అతడు నయన్‌కి మతం మార్చుకోవాలని, సినిమాలు మానేయాలని, housewife గా ఉండాలని షరతులు పెట్టినట్టు సమాచారం.
మొదట అంగీకరించినా, పెళ్లి తర్వాత తన పిల్లలు కూడా ఇంట్లోనే ఉండాలన్న విషయాన్ని ప్రభుదేవా చెప్పడంతో నయన్ వెనక్కి తగ్గినట్టు టాక్ నడుస్తోంది. ఆమె తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ – తన కలలు, కెరీర్ అన్నింటినీ వదులుకునేందుకు సిద్ధమైనా, చివరికి అది మంచికే జరిగిందని వ్యాఖ్యానించింది.