Lokesh Meeting: కడపలో లోకేష్ 69వ రోజు ప్రజాదర్బార్.. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ! 60 ఎకరాలను..

చైనా (China), రష్యా (Russia) అధ్యక్షులతో ప్రధాని మోదీ (PM Modi) భేటీ వేళ భారత్ పై అమెరికా (America) కలహ వైఖరిని ప్రదర్శించింది. సుంకాల విషయంలో మన దేశంపైనే నిందారోపణలు మోపింది. రష్యా నుంచి చమురు, ఆయుధాలను అధికంగా కొంటోందని అక్కసు వెళ్లగక్కింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తోపాటు వాణిజ్య సలహాదారు నవరో దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. 

Ration card: పుట్టిన బిడ్డ, కొత్తగా పెళ్లయిన వారిని రేషన్ కార్డులో చేర్చాలా? ఇలా చేస్తే సరిపోతుంది!

అయితే ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాత్రం రెండు దేశాల మధ్య సంబంధాలు బాగున్నాయని వ్యాఖ్యానించారు. ఇక భారత్ లోని అమెరికా ఎంబసీ కూడా భారత్ తో సంబంధాలపై సానుకూల వ్యాఖ్యలు చేసింది. సుంకాలను పూర్తిగా ఎత్తేస్తామని భారత్ తాజాగా ప్రతిపాదించిందని, కానీ అప్పటికే ఆలస్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 

3-Days Holidays: విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త.. సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మూడు రోజులు సెలవులు.. ఎందుకంటే?

సోమవారం తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా భారత్ పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ట్రంప్ పోస్టును ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. "మనం భారత్ తో అతి తక్కువ వ్యాపారం చేస్తామని కొద్ది మందే అర్థం చేసుకున్నారు. కానీ వారు మనతో భారీగా వ్యాపారం చేస్తున్నారు. అది తన అతి పెద్ద క్లయింట్ అయిన అమెరికాకు భారీగా వస్తువులను సరఫరా చేస్తోంది. 

Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! రాష్ట్రవ్యాప్తంగా 1,473 స్వచ్ఛాంధ్ర అవార్డులు!

మనం కొన్నే అమ్మగలుగుతున్నాం. ఇది దశాబ్దాలుగా ఒకవైపు నుంచే కొనసాగుతున్న సంబంధం. దీనికి కారణం భారత్ మనపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీనివల్ల అక్కడ విక్రయాలు జరపలేకపోతున్నాం. చమురు, ఆయుధ ఉత్పత్తులను రష్యా నుంచే భారత్ భారీగా కొంటోంది. మన దగ్గరి నుంచి అతి తక్కువగా కొనుగోలు చేస్తోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. 

Pm modi : ఏడేళ్ల తర్వాత చైనా పర్యటన.. భారత్ చేరుకున్న ప్రధాని మోదీ!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంవల్ల భారత్ లో లోని ఓ వర్గమే లబ్ధి పొందుతోందని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో వ్యాఖ్యానించారు. దీన్ని ఆపాల్సిన అవసరముందని చెబుతూనే.. భారత్ లో కులతత్వం ఉందనేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. 

Ntr Bharosa: దివ్యాంగుల పెన్షన్లు పై కీలక నిర్ణయం! ఈ రూల్ వర్తించదు! అవన్నీ ఆపేశారు!

‘రష్యా నుంచి చమురును కొంటున్నందుకే భారత్ పై 25 శాతం అదనపు సుంకాల్ని విధించాం. దీంతో మొత్తం 50 శాతానికి పెరిగిపోయి సుంకాల మహారాజాగా భారత్ మారింది. అమెరికా వస్తు, సేవలపై భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధించేది. అమెరికాతో వాణిజ్యం జరపడంద్వారా వచ్చే డాలర్లను రష్యాకు భారత్ ఇచ్చేది. 

Pawan Kalyan: పిఠాపురాన్ని బంగారంగా మార్చిన మా MLA..! పవన్ కళ్యాణ్‌పై బుచ్చిబాబు ప్రశంసలు!

వాటితో ఆత్మాహుతి డ్రోన్లను కొని ఉక్రెయిన్లోని అమాయక ప్రజల ప్రాణాలను రష్యా తీసేది' అని నవరో తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ, పుతిన్ ద్వైపాక్షిక భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భారత్-అమెరికా సంబంధాలను కొనియాడారు. వీటిని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొంటున్నట్లు ప్రకటించారు. 

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.! ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

భారత్ తో బంధం సరికొత్త శిఖరాలను చేరుకుంటోందని దిల్లీలోని అమెరికా ఎంబసీ పేర్కొంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన వేళ.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వేళ ఎంబసీ ఇలాంటి ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Farmers: రైతులకు ఏపీ ప్రభుత్వ గుడ్‌న్యూస్‌..! భూముల ఆధార్ అనుసంధానం ఇక ఈజీ!
Job Notification: త్వరలోనే భారీ నోటిఫికేషన్స్! వారు సిద్ధంగా ఉండండి! పత్రాలు రెడీ చేసుకోండి!
Bumper Offer: ఏపీ యువతకు సువర్ణావకాశం! రూ.50 వేల నుండి రూ.1 లక్ష గెలుచూసుకోవచ్చు! అస్సలు మిస్ అవ్వకండి!
School Holidays: విద్యార్థులకు శుభవార్త! సెప్టెంబర్‌లో వరుస సెలవుల జాతర!