అమెరికాలో మరోసారి ఉగ్రవాదం భయానక ఛాయలు విప్పింది. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ పట్టణంలో ఉన్న పెరల్ స్ట్రీట్ మాల్ వద్ద జరిగిన దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 1:26 గంటల సమయంలో ఓ వ్యక్తి మాల్‌లో సెలబ్రేషన్‌లో పాల్గొన్న పాలస్తీనియన్‌లపై మొలొటొవ్ కాక్‌టెయిల్ వంటి కెమికల్‌ను చల్లాడు. ఇది ఫైర్ బాంబ్‌గా వ్యవహరించబడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటన తర్వాత వెంటనే వీడియోలు వెలుగులోకి వచ్చాయి, అందులో అతను రెండు పెద్ద బాటిళ్లతో మాల్‌కి వచ్చి దాడి చేసినట్లు కనిపించింది. బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిలో కొందరిది విషమం అయినప్పటికీ ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు.
ఈ దాడిని ఉగ్రవాద చర్యగా భావిస్తూ దర్యాప్తు ప్రారంభించినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. నిందితుడు మహ్మద్ సబ్రీ సోలిమన్ (వయస్సు 45) అని గుర్తించబడినట్లు డెన్వర్ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ మార్క్ మిఖాలెక్ వెల్లడించారు. ఇతను ఇజ్రాయెల్ మద్దతుదారుడిగా భావించబడుతున్నాడు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీల విడుదల కోసం తిరగబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. "రన్ ఫర్ దెయిర్ లైవ్స్" పేరుతో బౌల్డర్‌లో జరిగిన ర్యాలీలో కూడా ఇతను పాల్గొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుండగా, ఎఫ్బీఐతో కలిసి స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: