అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసి, 69 దేశాలపై అధిక సుంకాలు విధిస్తూ ఆదేశించారు. అమెరికా వ్యాపారాలకు అనుకూలంగా గ్లోబల్ ట్రేడ్‌ను మళ్లీ మలచే యత్నంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ కొత్త టారిఫ్‌లు వచ్చే ఏడాది నుండి అమలులోకి రానుండగా, సిరియాపై అత్యధికంగా 41% సుంకం విధించారు. భారత్‌పై 25%, స్విట్జర్లాండ్‌పై 39%, కెనడాపై 35%, తైవాన్‌పై 20% సుంకాలు విధించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, పాకిస్థాన్ లాంటి దేశాలపై కూడా 19-20 శాతం వరకు సుంకాలు విధించారు.
ఈ జాబితాలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉండగా.. ట్రంప్ ఇప్పటికే న్యూఢిల్లీపై అధిక సుంకాల విధింపు విషయాన్ని పునరుద్ఘాటించారు. అత్యధిక దిగుమతులపై భారత్ సుంకాలు విధిస్తుండటంతో తమ వ్యాపారం తక్కువగానే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.