ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల రవాణా ఖర్చుల burden తగ్గించేందుకు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (Transport Allowance) అందిస్తోంది. ఒక విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున, ఏడాదికి మొత్తం రూ.6వేలు అందించనున్నారు. పాఠశాల తమ నివాస ప్రాంతానికి ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకే ఈ సాయం లభిస్తుంది. ఇది విద్యార్థులు చదువు నుండి దూరం కాకుండా చూడడానికి తీసుకున్న చక్కటి చర్యగా చెప్పొచ్చు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 79,860 మంది అర్హులైన విద్యార్థులకు రూ.47.91 కోట్ల రవాణా భత్యం చెల్లించనున్నారు. టీఏ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల bank accountలకు నేరుగా జమ చేయనున్నారు. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు మాత్రం ఈ పథకానికి అర్హులు కావు. అర్హులైన విద్యార్థుల వివరాలు ఇప్పటికే లీప్ యాప్‌లో నమోదు చేయగా, వాటిని ఎంఈవోలు పరిశీలించి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ధృవీకరించనున్నారు. ఆగస్టు 10 నాటికి తుది లబ్ధిదారుల జాబితా ఖరారవుతుంది. అకడమిక్ ఇయర్‌కి ప్రతి సంవత్సరం 10 నెలల పాటు ఈ అలవెన్స్ అందించనున్నారు.
ఈ పథకం వల్ల పేదవారి పిల్లలు కూడా బడి దూరంగా ఉన్నా, ఆ ఆర్ధిక భారం లేకుండా స్కూల్‌కి వెళ్లే అవకాశం పొందనున్నారు. ఇది విద్యలో సమానత్వాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.