
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి Enforcement Directorate (ED) మరోసారి షాక్ ఇచ్చింది. రూ.17,000 కోట్ల విలువైన లోన్ ఫ్రాడ్ కేసులో ఆయనపై ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై ఎస్బీఐ ఫ్రాడ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో అనిల్ అంబానీకి చెందిన దాదాపు 50 కంపెనీల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆగస్టు 5న హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చింది.
ఈ కేసులో అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను Shell Companiesకి అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ప్రమోటర్లకు లంచాలు ఇచ్చినట్టు అభియోగాలు కూడా వెల్లడి అయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న రూ.10 వేల కోట్ల లోన్ విషయంలోనూ ఇలాంటే ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్‌కు చెందిన షేర్ల విలువ భారీగా పడిపోయింది. మొత్తం మీద అనిల్ అంబానీ మరోసారి పెద్ద మనిషి నుంచి సమస్యల్లో చిక్కుకున్న వ్యక్తిగా మారిపోయారు.