రాష్ట్రంలోని మామిడి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. తోతాపురి మామిడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.260 కోట్లు విడుదల చేసింది. ఈ డబ్బులు గురువారం నుంచి మామిడి రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. మామిడి ధరలు పతనమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు మామిడి రైతులకు కిలో మామిడికి రూ.4 చొప్పున అందించనుంది. ఈ క్రమంలోనే తోతాపురి మామాడి రైతులకు సబ్సిడీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నగదు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Eligible Farmers: అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ లిస్ట్ వచ్చేసింది! అర్హులు వీరే... వెంటనే ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో మామిడి పంట ఎక్కువగా సాగు చేస్తారు. అందులోనూ తోతాపురి మామిడి రకం సాగు అధికం. అయితే ఈ సీజన్‌లో తోతాపురి మామిడి రైతులు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్పత్తి అధికంగా ఉండటం, డిమాండ్ తక్కువగా ఉండటంతో మామిడి ధరలు పడిపోయాయి. దీంతో మామిడి రైతుకు కిలోకు 5-6 రూపాయలు కూడా దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మామిడి రైతులు తమ కష్టాలను సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. పల్ప్ కంపెనీల యజమానులు కిలో మామిడి రూ.12 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!
అయితే ఇక్కడితో పోలిస్తే తమిళనాడులో తక్కువ ధరకే తోతాపురి మామిడి రకం దొరుకుతూ ఉండటంతో పల్ప్ యూనిట్లు చిత్తూరు జిల్లా రైతుల నుంచి మామిడి కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో మామిడి రైతులు డీలా పడిపోయారు. ఈ క్రమంలోనే కిలో మామిడి రూ.12లుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ఇందులో పల్ప్ యూనిట్లు కేజీ మామిడికి రూ.8లు చెల్లిస్తే, ప్రభుత్వం రూ.4 చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మామిడి రైతులకు సబ్సిడీ నిధులు గురువారం నుంచి విడుదల చేయనున్నారు.అలాగే ఈ సీజన్‌లో 5.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి తోతాపురి మామిడి పండ్ల దిగుమతులను నిషేధించారు.
ఇది కూడా చదవండి: Farmers Relief: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా.. చెక్ చేసుకోండి!
మరోవైపు మామిడి రైతులకు అందించే సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇందుకోసం రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని అధికారులు మామిడి రైతులకు సూచిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!
Bank strike: అలర్ట్.. రేపు బ్యాంకులు బంద్! కారణం ఇదే!
Free Bus: ఏపీలో ఉచిత బస్సు పై క్లారిటీ! చంద్రబాబు కీలక ప్రకటన!
Quantum technology: సిలికాన్ వ్యాలీ తర్వాత క్వాంటమ్ వ్యాలీ.. అమరావతిలో కొత్త అధ్యాయం!
Central Government: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! వచ్చే నాలుగైదు నెలల్లో..!
Achchennaidu: ఏపీకి మూడు కొత్త బోర్డులు..! కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు కీలక వినతులు!
Formers: ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..! అకౌంట్‌లలోకి డబ్బులు!
Reservation: మహిళలకు శుభవార్త! సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్!
Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!
Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..
Mobile Bills: మొబైల్ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!
Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!
New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!
Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!
Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: