ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ అవార్డుల కార్యక్రమం భారతీయ సినిమా ప్రపంచానికి ఒక పెద్ద పండుగలా ఉంటుందని చెప్పొచ్చు. అన్ని భాషల సినిమాలు ఒకే వేదికపై గుర్తింపు పొందడం అనేది ఒక ప్రత్యేకమైనది.
ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇద్దరికీ దక్కింది. ఒకరు బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్. ఆయన నటించిన జవాన్ సినిమాకు ఈ గౌరవం లభించింది. మరొకరైన విక్రాంత్ తన అద్భుతమైన నటనతో మెప్పించి 12th ఫెయిల్ సినిమా కోసం ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఇద్దరికీ ఒకేసారి ఈ అవార్డు రావడం అందులోని ఇద్దరు ఒక చిత్ర పరిశ్రమ నుంచి అందుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.
జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డును అందుకున్నారు. రాణి ముఖర్జీ చాలాకాలం నుంచి బాలీవుడ్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి ఆమె నటనకు దేశస్థాయి గౌరవం రావడం అభిమానులను సంతోషపరిచినది.
మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఈ సారి జాతీయ స్థాయిలో మెరిసింది భగవంత్ కేసరి సినిమాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా సామాజిక సందేశం, భావోద్వేగాలు కలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అవార్డు రావడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం.
అలాగే హనుమాన్ సినిమా యాక్షన్ విభాగంలో రెండు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరీల్లో గుర్తింపు పొందింది. ఇప్పటికే విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడం మరింత ప్రత్యేకం.
బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో బలగం సినిమాలో "ఊరు పల్లెటూరు" పాటకి గేయ రచయిత కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో 'బేబీ' సినిమాకి దర్శకుడు సాయి రాజేష్ నీలం, అదే బేబీ చిత్రంలో నుండి మేల్ సింగర్ కేటగిరీలో ప్రేమిస్తున్నా పాటకి సింగర్ PVNS రోహిత్ కి ఈ అరుదైన అవార్డులు లభించాయి.ఉత్తమ బాలనటి కేటగిరీలో 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గానూ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ జాతీయ అవార్డు అందుకున్నారు.