AP Govt: ఏపీలో వృద్ధులకు గుడ్‌న్యూస్.. కేవలం 10 నిమిషాల్లో ఈ కార్డు ఉచితం! ఎన్నో ప్రయోజనాలు - ఎలా పొందాలంటే?

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మరోసారి బయటపడింది. కొంతమంది కేటుగాళ్లు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, సన్న బియ్యం పేరుతో మార్కెట్‌లో అమ్మకాలు జరుపుతున్నారు. ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మద్దిపాడు దగ్గర లారీ బోల్తా పడిన ఘటనతో ఈ మాఫియా గుట్టు బయటపడింది. రోడ్డుప్రమాదం కారణంగా బయటపడ్డ ఈ వ్యవహారం పై అధికారులు ఆరా తీస్తే అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది. పల్నాడు ప్రాంతంలో ఈ రకం అక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని స్థానిక సమాచారం చెబుతోంది. చెన్నై మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ రవాణా జరుగుతుందని వెల్లడైంది.

Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలు బంద్..! విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో..!

లారీ బోల్తా ఘటనతో బయటపడిన ఈ వ్యవహారం క్రమంగా పెద్ద దందాకు దారితీసింది. రేషన్ బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు పాలిష్ చేసి, కొత్త సంచుల్లో ప్యాక్ చేస్తున్నారు. ఆ తర్వాత 25 కిలోల బస్తాల్లో నింపి సన్న బియ్యం పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. కిలో రూ.12కు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని దళారులు మిల్లులకు రూ.20కు అమ్మేస్తున్నారు. అక్కడి నుంచి సన్న బియ్యంగా రీసైక్లింగ్ చేసి, 25 కిలోల బస్తాను రూ.1500కి అమ్మేస్తున్నారు. ఇలా ఒకే లావాదేవీలో భారీ లాభాలు సాధిస్తున్నారని సమాచారం. ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి తరలించి చెన్నై మార్కెట్లకు చేరుస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ITR Filing: ఆదాయపు పన్ను రీఫండ్లపై క్లారిటీ..! ముందుగా వాటికే ప్రాధాన్యం..!

ఇదే కాకుండా రేషన్ కార్డుదారులు తమ బియ్యాన్ని నేరుగా వినియోగించుకోకుండా దళారులకు అమ్మేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మాఫియా మరింత దూకుడుగా ఈ దందాను విస్తరించుకుంటోంది. అధికారులు నిఘా ఉంచినా, అక్రమార్కులు కొత్త మార్గాలను వెతుక్కుంటూ సరిహద్దులు దాటిస్తున్నారని సమాచారం. గతంలో కాకినాడకు రేషన్ బియ్యం తరలించగా, ఇప్పుడు చెన్నైకి తరలిస్తున్నారు. అక్కడినుంచి విదేశాలకు కూడా రవాణా జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి పౌరసరఫరాల శాఖ నిఘా వ్యవస్థను సవాలు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

Sensation OTT: 2025లో విడుదలైన ప్రేమకథా చిత్రం.. ఇప్పటికీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది!

గతంలో రేషన్ బియ్యం మాఫియాపై పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా దాడులు జరిపి, మిల్లుల్లో బియ్యం సీజ్ చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ కొద్దికాలంలోనే ఈ మాఫియా మళ్లీ పుంజుకుంది. అధికారుల చర్యలు తాత్కాలికంగానే నిలిచిపోయి, అక్రమార్కులు కొత్త మార్గాలతో తిరిగి దందా మొదలుపెట్టారని తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాను ఆపటం కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నై రూట్ కొత్త కేంద్రంగా మారిపోవడంతో అధికారులు నిఘా పెంచకపోతే ఈ దందా దేశాంతరాల వరకు విస్తరించే అవకాశముందని సూచిస్తున్నారు.

Rythu Bandhu: ఏపీలో రైతులకు శుభవార్త! రైతు బంధు పథకం మళ్లీ ప్రారంభం! ఒక్కో రైతుకు రూ.2 లక్షల వడ్డీ లేని రుణం!
Aviation news: ఆ నగరానికి మహర్దశ! రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్టోబరు చివరికి అందుబాటులోకి! ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Breakfast: రోజులో అత్యంత ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్.. మరి దాన్ని స్కిప్ చేస్తున్నారా?
Annual recharge plans: జియో, ఎయిర్‌టెల్, వి, బీఎస్‌ఎన్‌ఎల్.. ఒకే రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు! ఈ వార్షిక ప్లాన్‌లు మీ కోసమే!
Bottle Gourd: సొరకాయ.. రుచి, ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు ఉన్నవాళ్లు తింటే ప్రమాదమే!
Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు అద్భుత అవకాశం! నెలకు రూ.7 వేల ప్రోత్సాహకం.. జస్ట్ టెన్త్ పాసైతే చాలు!