ముంబై మహానగరానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. పాన్‌వెల్, ఉల్వే ప్రాంతాల మధ్య నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేర్కొనవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్ (BOM) పై అధికభారం తగ్గించేందుకు దీన్ని రూపకల్పన చేయడం జరిగినది. నూతనంగా ఏర్పాటైన ఈ విమానాశ్రయానికి IATA కోడ్ NMI, ICAO కోడ్ VANM గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగినది.
ప్రయాణికులు టికెట్ బుక్ చేసేటప్పుడు కొత్త ఎయిర్‌పోర్ట్ కోడ్ NMI ను తప్పనిసరిగా పరిశీలించాలి . ప్రముఖ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు అయిన MakeMyTrip, Cleartrip, Yatra, Ixigo వంటి వాటిలో ఇప్పటికే ఈ కోడ్ ప్రభుత్వం అధికారికంగా జత చేయడం జరిగినది. బోర్డింగ్ పాస్ లో ఎయిర్‌పోర్ట్ కోడ్ సరిగా ఉందని చూసుకోవడం ద్వారా ప్రయాణికులు గందరగోళాన్ని కి పుల్ స్టాప్ పెట్టేందుకు ఇలా తీసుకురావడం జరిగినది.
ఫ్లైట్ ఆపరేషన్ల విషయానికి వస్తే, మొదటిగా IndiGo రోజుకు 18 వరకు డొమెస్టిక్ ఫ్లైట్స్ నడపనుంది. అలాగే Akasa Air కూడా ప్రారంభ దశలోనే 100కి పైగా విమాన సర్వీసులు అందించనుంది. వీటితో పాటు రాబోయే సంవత్సరాల్లో అంతర్జాతీయ రూట్స్ కూడా జోడించబడతాయి. ఈ కొత్త టెర్మినల్ మొదటి దశలో సంవత్సరానికి దాదాపు 20 మిలియన్ ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం కలిగి ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ప్రయాణికుల సౌకర్యం కోసం పలు సూచనలు ప్రకటించారు. డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం కనీసం రెండు గంటల ముందు ఎయిర్‌పోర్ట్ చేరుకోవాలని, అంతర్జాతీయ ప్రయాణాల కోసం మరింత ముందే రావాలని తెలపడం జరిగినది. ఐడీ ప్రూఫ్, బోర్డింగ్ పాస్, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. నిషేధిత వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధం. కొత్త టెర్మినల్ పరిచయం లేకపోతే సిబ్బంది సహాయం తీసుకోవాలని సూచించారు.
అంతేకాకుండా, ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడానికి సులభంగా ఉండేలా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. సియోన్-పాన్‌వెల్ హైవే ద్వారా నేరుగా చేరుకోవచ్చు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) సౌత్ ముంబై నుండి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. పాన్‌వెల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండటంతో రైలు, రోడ్, మెట్రో మార్గాల్లో సౌకర్యవంతంగా చేరుకోవచ్చు. అదనంగా MSRTC ప్రత్యేక బస్సులు కూడా ముంబై, నవి ముంబై, సమీప నగరాల నుండి నడపనున్నారు.