దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అధిక వేగం, ఆధునిక సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. టికెట్ ధర సాధారణ రైళ్లకంటే ఎక్కువైనా, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా డిమాండ్ పెరుగుతోంది.
ఈ క్రమంలో, మరో మూడు కొత్త వందే భారత్ రైళ్లు నేడు ప్రయాణికుల కోసం ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. కొత్త మార్గాలు – బెంగళూరు-బెళగావి, అజ్ని (నాగ్‌పూర్)-పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా. అదేవిధంగా బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు, రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించనున్నారు.
బెళగావి-బెంగళూరు వందే భారత్ ప్రతి రోజు తెల్లవారుజామున 5:20కి బెళగావి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50కి బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2:20కి ప్రారంభమై రాత్రి 10:40కి బెళగావి చేరుతుంది. ఈ మార్గంలో ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు వంటి స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. విస్తరిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అధిక వేగం, ఆధునిక సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. టికెట్ ధర సాధారణ రైళ్లకంటే ఎక్కువైనా, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా డిమాండ్ పెరుగుతోంది.
ఈ క్రమంలో, మరో మూడు కొత్త వందే భారత్ రైళ్లు నేడు ప్రయాణికుల కోసం ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. కొత్త మార్గాలు – బెంగళూరు-బెళగావి, అజ్ని (నాగ్‌పూర్)-పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా. అదేవిధంగా బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు, రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించనున్నారు.
బెళగావి-బెంగళూరు వందే భారత్ ప్రతి రోజు తెల్లవారుజామున 5:20కి బెళగావి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50కి బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2:20కి ప్రారంభమై రాత్రి 10:40కి బెళగావి చేరుతుంది. ఈ మార్గంలో ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు వంటి స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.