జాతీయ మెడికల్ రిజిస్టర్ (NMR) అనే డేటాబేస్ 2024 ఆగస్టులో ప్రారంభమైంది. దేశంలోని అన్ని అలొపతి వైద్యులను ఇందులో నమోదు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినా, ఇప్పటివరకు 13.9 లక్షల డాక్టర్లలో కేవలం 996మంది మాత్రమే రిజిస్టర్ అయ్యారు. మొత్తం 11,200 దరఖాస్తులు వచ్చినప్పటికీ, 91% ఆమోదం పొందలేదు.
ఈ రిజిస్టర్ ద్వారా ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్ ఇవ్వాలని, దాంతో దేశవ్యాప్తంగా వారు వైద్యం చేయడానికి అర్హత పొందేలా చేయాలని ఉద్దేశం. తర్వాత నర్సులు, పారామెడిక్స్ కోసం కూడా ఇలాంటి రిజిస్టర్‌లు తెచ్చే ప్రణాళిక ఉంది. కానీ డాక్టర్ల రిజిస్టర్‌నే పూర్తిగా అమలు చేయలేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు.
మొదటి మూడు నెలల్లో 6,000 దరఖాస్తులు వచ్చి, ఆ తర్వాత నాలుగు నెలల్లో 800కే పడిపోయాయి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌ల రికార్డులు NMRతో ఇంకా లింక్ కాలేదు. రాష్ట్ర కౌన్సిల్ ధృవీకరించినా, NMC తిరస్కరిస్తోందని కొంతమంది డాక్టర్లు ఆరోపిస్తున్నారు.