ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం, మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం వంటి అంశాలపై ఆయన కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
పాఠశాలలకు వాటి మౌలిక వసతులు, నిర్మాణం ఆధారంగా రేటింగ్ ఇస్తున్నట్టుగా నారా లోకేష్ గారు శాసనసభకు వివరించారు. ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా, పేద విద్యార్థుల కోసం "చెత్తను ఇవ్వండి - పుస్తకాలు, పెన్నులు ఉచితంగా తీసుకెళ్లండి" అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.
పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు దసరా సెలవుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ప్రభుత్వం వారికి శుభవార్త ప్రకటించింది. ఈ విషయాన్ని లోకేష్ గారు తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
దసరా సెలవులను ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టిడిపి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని లోకేష్ గారు తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు, విద్యాశాఖ అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది అని తెలిపారు. ఈ నెల 22 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికైన X (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. అదేవిధంగా, దానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని కూడా లోకేష్ గారు పోస్ట్ చేయడం జరిగింది.