ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!
ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపు (Thursday) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో "మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0" నిర్వహించనుంది. ఒకేరోజు దాదాపు 2.28 కోట్ల మందిని భాగస్వాములను చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హాజరుకానున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలతో కలిపి మొత్తం 61 వేల విద్యా సంస్థలు పాలుపంచుకోనున్నాయి.
ఇది కూడా చదవండి: AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!
ఈ సమావేశంలో 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, కోటిన్నరకు పైగా తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు (Students) పాల్గొననున్నారు. కార్పొరేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ టీచర్ సమావేశాలను ప్రభుత్వ బడుల్లోనూ నిర్వహించాలన్న మంత్రి నారా లోకేశ్ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో ముఖ్యమైన విద్యా సంబంధిత కార్యక్రమం కావడం గమనార్హం. ఈ సమావేశం ద్వారా తమ పిల్లల చదువు, ప్రవర్తన, ఇతర నైపుణ్యాల పురోగతిని తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చు. విద్యార్థుల సమగ్ర ప్రోగ్రెస్ కార్డులను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందజేస్తారు. అంతేకాకుండా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధన తీరుపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..
Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం! హైదరాబాదు కుటుంబం సజీవదహనం
New National Highway: హైదరాబాద్-విశాఖ హైవే పనులు వేగంగా.. రైతులకు మాత్రం బాధలే బాధలు!
Delhi Tour: బుందేలఖండ్ తరహాలో సాయం చేయండి.. కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి!
Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: