మీ ఇంట్లో పెద్దవాళ్లకి ఫోన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంత మంచి ఫీచర్లు, తక్కువ ధరలో మోటోరొలా ఫోన్ అందిస్తుంది. ఈ ఫోన్ సాధారణంగా అమ్మమ్మలకు తాతయ్యలకు ప్రత్యేకంగా కాకపోయినా వారికి బహుమతి రూపంలో ఇవ్వడం ద్వారా వారు చాలా హ్యాపీ అవుతారు మీకు అదనంగా గిఫ్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఈ ఫోన్ పై లుక్ వేయండి
టెక్ మార్కెట్‌లో రోజురోజుకు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అవుతున్నప్పటికీ కొన్నే ఫోన్లు ప్రత్యేకతతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి ఫోన్లలో మోటోరొలా ఫోన్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు, మరియు వినియోగదారుల కోసం రూపొందించిన ఫంక్షనాలిటీ కారణంగా మోటోరొలాకు భారత మార్కెట్‌లో మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది.
ఇప్పుడు ఈ కంపెనీ తన తాజా మోడల్ Moto G06 Power ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా పెద్ద బ్యాటరీ, హై-రెఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లు, మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది.
బ్యాటరీ
Moto G06 Power యొక్క ప్రధాన ఆకర్షణ 7000mAh పెద్ద బ్యాటరీ. ఒకసారి ఫోన్ ను పూర్తిగా చార్జ్ చేస్తే ఇది సుమారు మూడు రోజులపాటు ఫోను ఉపయోగించడానికి సరిపోతుంది. ఈ ఫోన్‌కి 18W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే ఇవ్వబడుతుంది, కాబట్టి ఎక్కువ సమయం చార్జింగ్ కోసం కేటాయించవలసిన అవసరం లేదు. అంతేకాదు, Battery Health Guard అనే ప్రత్యేక టెక్నాలజీ వల్ల బ్యాటరీ ఆరోగ్యం కూడా రక్షించబడుతుంది, దీని వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది.
డిస్‌ప్లే
ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ మరియు గేమింగ్ చాలా స్మూత్‌గా జరుగుతుంది. ఈ డిస్‌ప్లే గేమింగ్ లవర్స్ మరియు వీడియో చూసే వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
కెమెరా
Moto G06 Power డ్యూయల్ కెమెరా సెట్‌ప్ తో వస్తుంది. ఫోటోలు తీసేటప్పుడు స్పష్టమైన డీటెయిల్స్ మరియు మంచి రంగులు కనబడతాయి. ఫ్రంట్ కెమెరా కూడా సెల్ఫీస్ కోసం ఉత్తమంగా ఉంది.
సాఫ్ట్‌వేర్ మరియు ఇతర ఫీచర్లు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. దాంతో కొత్త ఫీచర్లు, బెటర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. పవర్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ వల్ల ఫోన్ వేగంగా, ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది.
ధర
ఈ ఫోన్ ధర కేవలం రూ. 7,499 గా ఉంది. ఈ ధరలో పెద్ద బ్యాటరీ, మంచి కెమెరా, హై-రెఫ్రెష్ రేట్ డిస్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ 15 ఫీచర్లు అందించడం వినియోగదారులకు మంచి ఆఫర్ ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.