తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటి రాశీ ఖన్నా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, అనుభవాలు, అలాగే టాలీవుడ్ మరియు బాలీవుడ్ పరిశ్రమల మధ్య తేడాల గురించి మాట్లాడారు. ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది ఏమిటంటే టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నాకు లభించిన గౌరవం, ప్రేమ, ఆదరణ మరెక్కడా దొరకలేదు” అన్న గర్వభావం.
రాశీ ఖన్నా మాట్లాడుతూ, “తెలుగు చిత్రసీమలో పనిచేయడం నిజంగా ఒక ఆనందం. ఇక్కడ ప్రతి ఒక్కరు, ముఖ్యంగా హీరోలు మరియు దర్శకులు, హీరోయిన్లను ఎంతో గౌరవంగా చూస్తారు. షూటింగ్ స్పాట్‌లో మహిళల పట్ల ఉన్న గౌరవం నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చింది. ఈ వాతావరణం వల్లే టాలీవుడ్‌లో పనిచేయడం నాకు ఎంతో ఇష్టం” అని తెలిపారు.
అయితే, ఆమె హిందీ మరియు తమిళ పరిశ్రమలలో కూడా మంచి గుర్తింపు పొందినప్పటికీ, వాటితో పోల్చితే తెలుగు ఇండస్ట్రీలో పని చేసే అనుభవం భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. “టాలీవుడ్‌లో షూటింగ్ టైమ్ సాధారణంగా రోజుకు 9 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ బాలీవుడ్, తమిళ చిత్రసీమలలో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేయాలి. ఈ తేడా వల్ల కొన్నిసార్లు శారీరకంగా, మానసికంగా కూడా అలసిపోతాం” అని రాశీ ఖన్నా చెప్పింది.
ఆమె ఆమె ఇంకా ఏం చెప్పిందంటే తెలుగు సినిమాలు చాలా ప్రొఫెషనల్‌గా తయారవుతాయి. ప్రతి యూనిట్ సభ్యుడు సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తాడు. అక్కడ (హిందీ లేదా తమిళ ఇండస్ట్రీల్లో) వాతావరణం కొంచెం రఫ్‌గా ఉంటుంది. తెలుగు చిత్రసీమలో మాత్రం ఒక కుటుంబంలా ఉంటాం. అందుకే నాకు ఇక్కడి వారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది.
రాశీ ఖన్నా గత కొన్నేళ్లుగా పలు భాషల్లో నటించినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల మధ్య ఆమెకు ఉన్న అభిమాన బలం మాత్రం వేరే స్థాయిలో ఉంది. “నన్ను అభిమానించే వారు ఎక్కువగా తెలుగు వాళ్లే. సోషల్ మీడియాలో కూడా నాకు ఎక్కువగా మెసేజ్‌లు, కామెంట్లు తెలుగు రాష్ట్రాల నుంచే వస్తాయి. ఈ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని ఆమె హృదయపూర్వకంగా తెలిపింది.
టాలీవుడ్‌లో “ఊహలు గుసగుసలాడే”, “బెంగాల్ టైగర్”, “జయ జానకి నాయక”, “ప్రతి రోజూ పండగే” వంటి సినిమాల ద్వారా రాశీ మంచి గుర్తింపు సంపాదించింది. ఇటీవల ఆమె వెబ్ సిరీస్‌లు మరియు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తోంది. కానీ ఆమె చెబుతుంది అంటే “ఎన్ని భాషల్లో నటించినా, తెలుగు సినిమాలో షూట్ చేస్తే వచ్చే ఆనందం వేరు.”
ఇక ఆమె నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’, సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఒక హృదయాన్ని తాకే ప్రేమకథగా రూపొందిందని రాశీ చెబుతోంది. “సిద్ధూ చాలా ఎనర్జిటిక్ హీరో. మా జోడీ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని ఆమె ఉత్సాహంగా తెలిపింది.
సినీ పరిశ్రమలో ఉన్న కఠిన పరిస్థితుల మధ్య స్త్రీలకు గౌరవం, సమాన హక్కులు ఇవ్వడం ఎంత అవసరమో రాశీ మాటలు మరోసారి గుర్తుచేశాయి. టాలీవుడ్ పరిశ్రమలో ఉన్న ఆ సానుకూల వాతావరణం గురించి ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తంగా, రాశీ ఖన్నా మాటల్లో ఒక నిజమైన అనుభవం టాలీవుడ్‌లో గౌరవం, ఆప్యాయత, ప్రేమ ఎక్కువ అని. అదే ఈ ఇండస్ట్రీని ప్రత్యేకంగా నిలిపే తేడా.