ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో ఇవాళ (బుధవారం) ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు కలిశారు. గాదె శ్రీనివాసులు నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కూటమి ప్రభుత్వానికి తన మద్దతు గాదె శ్రీనివాసులు నాయుడు ప్రకటించారని చెప్పారు. ప్రభుత్వానికి -ఉపాధ్యాయులకు మధ్య శ్రీనివాసులు నాయుడు వారధిగా పనిచేస్తారని సీఎం చంద్రబాబుకు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి . టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. తన గెలుపు కోసం సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలన్నీ సహకరించాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కలిసి పని చేయటం తనకు అలవాటు అని చెప్పారు. చంద్రబాబు ఆశీర్వాదంతో తనకు కొండంత ధైర్యం వచ్చిందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!
వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?
తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్లడి!
రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...
గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?
వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: