టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్(Nara Lokesh) సంచలన కామెంట్స్ చేశారు. రెడ్ బుక్(Red Book) పని మొదలైందని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు. రెడ్ బుక్(Red Book) గురించి గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం మొదలైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రతీ ఎన్నికల్లో విజయం కూటమిదేనని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చినా.. 9 నెలల్లోనే కనీవిని ఎరుగని సంక్షేమం అందించినా.. ఆ ఘనత టీడీపీదేనని అన్నారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి లోకేష్.
ఇది కూడా చదవండి: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం! పరిస్థితి విషమం!
ఒక రోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్షహోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగుళూరు వెళ్లిపోతాడని విమర్శించారు. వైసీపీ(Ycp) ప్రభుత్వ హయాంలో టీడీపీ ఎదుర్కొన్న పట్టభద్రుల ఎన్నికలు గేమ్ చేంజర్‌గా మారాయని అన్నారు. 2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందన్నారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. ఫించన్ పెంచినా, అన్న క్యాంటీన్లు ప్రారంభించినా, తల్లికి వందనం ప్రారంభించినా, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద నిధులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పారు. యువత గెలిపించిన గెలుపు ఇది అని పేర్కొన్నారు. మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?
తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్లడి!
రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...
గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?
వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: