తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 12 మంది పడవలో బ్రిడ్జి లంకకు వెళ్లారు. అందరూ తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీలో ఆయన అఖండ విజయం! 9 రౌండ్లలో లక్షా 45 వేల ఓట్లు!
రాజమండ్రి (Rajahmundry) పుష్కర ఘాట్ (Pushkara Ghat) దగ్గర ఘోర ప్రమాదం (Boat Accident)జరిగింది. పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చెవల అన్నవరం, గాడా రాజు మృతి (Two dead) చెందారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు (Police) పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు., వివరాల్లోకి వెళితే.. గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకకు12 మంది పడవలో వెళ్లారు. రాత్రి సమయంలో పడవలో తిరిగి వస్తుందగా రెండు వంతెనల మథ్యలో పడవలోకి నీరు చేరింది. దీంతో పడవ మునిగిపోయింది.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?
పడవలో ఉన్న ఇద్దరు నీటిలో మునిగిపోగా.. 10 మంది ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. లంకల్లోకి నాటుపడవల్లో మందు పార్టీలకు వెళుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎటువంటి భద్రత ప్రమాణాలు లేకుండా మత్స్యకారులు 24 గంటల పాటు గోదావరిలో నాటుపడవలు నడుపుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు గోదావరి తీరంలో ఉన్న లంక గ్రామాలు అడ్డాగా మారాయి.
రాజమండ్రి పుష్కర ఘాట్‌లో మునిగిపోయిన నాటుపడవను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటిలో ఊబిలో నాటుపడవ కూరుకుపోయింది. వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. నాటుపడవలో వారు రాజమండ్రి శివారు సింహాచల్ నగర్, భవానీ పురం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం! రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!
పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!
బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?
రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..
చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..
ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!
రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: