తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందగా, 2024 ఎన్నికల్లో తిరిగి గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ గతంలో అమలు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చేనేత కార్మికులకు తీపి కబురు అందించింది. గత టీడీపీ హయాంలో అమలైన థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేసింది. దీంతో చేనేత కార్మికులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరోసారి ఈ పథకాన్ని పునరుద్ధరించడంతో, రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఊరట లభించనుంది. థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులలో ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎక్కువ వాటా దక్కనుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారు. 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

చేనేత కార్మికులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి చేనేత సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న కార్మికులు మాత్రమే అర్హులు. పథకానికి అనుగుణంగా, ప్రతి కార్మికుడు తన నెలవారీ ఆదాయంలో 8% పొదుపు చేస్తే, ప్రభుత్వం అదనంగా 16% నిధులు జమ చేస్తుంది. మూడు నెలలకు ఒకసారి, ఈ మొత్తాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఒక చేనేత కార్మికుడు నెలకు రూ.1000 పొదుపు చేస్తే, ప్రభుత్వం అదనంగా రూ.2000 జమ చేస్తుంది. అంటే మూడు నెలల తర్వాత కార్మికుడి ఖాతాలో రూ.9000 ఉంటుంది. ఏడాదిలో, రూ.12,000 పొదుపు చేస్తే, ప్రభుత్వ నిధులతో కలిపి మొత్తం రూ.36,000 అందుతుంది. ఈ మొత్తాన్ని అవసరమైన సమయంలో ఉపసంహరించుకోవచ్చు. పాత సహకార సంఘాల సభ్యులే కాకుండా, కొత్తగా ఏర్పడిన చేనేత సహకార సంఘాల్లో సభ్యులైన కార్మికులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. దీని ద్వారా మరింత మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగేలా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group