కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇక మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ బదులిచ్చారు. 'తల్లికి వందనం' సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్న లోకేశ్.. నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో గత టీడీపీ హయాంలో 1.82 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే ఎట్టిపరిస్థితుల్లోను మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి తీరుతామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...
గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?
వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..
బెజవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..
దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!
విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..
కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: