FASTag: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ప్ర‌యోజ‌నాలు, ధ‌ర పూర్తి వివ‌రాలు ఇవిగో..!

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా మద్దతు చూసి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందని, ఆయన వ్యక్తిగత విమర్శల దాకా దిగజరుతున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.

Special Trains: ఏపీకి ప్రత్యేక రైళ్లు... అరుణాచలం మీదుగా! హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఈరోజు ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, వారి వ్యాఖ్యలు, విధ్వంసకర రాజకీయాలు చూస్తుంటే ఒక రాజకీయ నేతగా తనకు చాలా బాధ కలుగుతుందన్నారు.

Travel allowance: సర్కార్‌ బడి పిల్లలకు భలే ఛాన్స్..! రూ.6 వేల రవాణా భత్యం వచ్చేస్తుంది!

వ్యక్తిగత దూషణలు రాజకీయ సంప్రదాయానికి తగవు"
మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం తనకు ఉన్నదని, నాలుగైదు దశాబ్దాలుగా రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్నానని చెప్పారు. కానీ వైసీపీ నేతల వ్యవహార శైలిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాయి గానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం, నాయకులను కించపరచడం తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీ వర్షాలు... కాఫర్ డ్యామ్‌ వద్ద యంత్రాల ధ్వంసం

వైసీపీ జగన్ తీరు బాధాకరం"
ప్రస్తుత వైసీపీ పరిస్థితులు, జగన్ మాటలు, పర్యటనలు, ప్రకటనలన్నింట్లో భయంతో కూడిన అసహనం కనిపిస్తున్నదన్నారు.
175 స్థానాల నుంచి 11కి పడిపోయిన దెబ్బతో జగన్ అనైతికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ, విధ్వంసకర పరిస్థితులకు ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా ఉందన్నారు.

AP Accident: బాపట్లలో విషాదం.. ఆరుగురు మృతి! గ్రానైట్ క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.!

ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించాలి"
ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక, దిగువ స్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలి" అంటూ జగన్‌కి హితవు పలికారు.
తాను ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానని – వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి – వారెప్పుడూ వైఖరి తప్పితే నేరుగా మందలించేవారని, కానీ వివాదాస్పదంగా మాట్లాడమని ఎప్పుడూ ప్రోత్సహించలేదని వివరించారు.

YCP EX-MLA: మాజీ ఎమ్మెల్సీ కి బిగుస్తున్న ఉచ్చు! మరో కేసు నమోదు!

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కక్షపూరిత రాజకీయాలు వద్దని, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని మంత్రులందరినీ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

Toyota Innova Crysta: 7 సీటర్ల ఎంఫీవీ ఇప్పుడు 39 కిలోమీటర్ల మైలేజ్‌తో…! ధర ఎంత అంటే..!

ఫ్రస్టేషన్ మాటల్లోనూ కనిపిస్తోంది.
చంద్రబాబు గురించి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వింటే ఆయన ఎంత దిగజారి మాట్లాడుతున్నారో, ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. గతంలో రెండు దశాబ్దాలకు పైగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదని, అది ఓ నైతిక విలువ అని మంత్రి పార్థసారథి గుర్తుచేశారు.

BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు!