రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే 40,336 వ్యవసాయ కనెక్షన్ లు మంజూరు చేశామని తెలిపారు. 22,709 కనెక్షన్ లు రైతులకు ఇచ్చి, ఇప్పటికే వినియోగంలోకి తెచ్చామని వెల్లడించారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు రూ. 2.60 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్ కు రూ. 12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో వేర్వేరు రేట్లకు ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేశారని... ఇకపై అలా జరగకుండా చూస్తామని గొట్టిపాటి చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్ల దొంగతనాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే... కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఇస్తామని తెలిపారు. డిస్కమ్ ల మధ్య రేట్లలో అంతరం లేకుండా చూస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బెజవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..
దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!
విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..
కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: