విజయవాడలో త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భుశనేశ్వరి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భవనం కోసం ఇటీవల 16వ జాతీయ రహదారిపై నున్న ఎల్ఈపీఎల్ మాల్ పక్కన, సాయిబాబా ఆలయ రోడ్డు జంక్షన్‌లో 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో జీప్లస్ 5 విధానంలో అత్యంత అధునాతనంగా భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విజయవాడ భవనం పూర్తయితే ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇందుకోసం హైదరాబాద్ ట్రస్ట్ భవన్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను విజయవాడ కార్యాలయానికి బదిలీ చేస్తారు. అవసరాన్ని బట్టి స్థానికంగానూ కొందరిని నియమించుకుంటారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!
విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..
కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: