ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ముగిసి తొమ్మిది నెలలు అయినప్పటికీ ఏపీలో రాజకీయ వేడి ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. అయితే 40 శాతం ఓటింగ్ షేర్ సాధించి ప్రజా క్షేత్రంలో ఆ పార్టీ ఇంకా బలంగానే కనిపిస్తోంది. అయితే వైసీపీని ఎలాగైనా నిర్వీర్యం చేయాలని పట్టుదలతో అధికార పార్టీలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే వైసీపీకి చెందిన పలువురు నాయకులను ఆ పార్టీ నుంచి లాగేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు,ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ! పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కొందరు కీలక నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి వంటి నేతలు జనసేన గూటికి చేరారు. తాజాగా మరో మాజీ వైసీపీ నేత జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మంగళవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే తాను జనసేనలో చేరుతానని పెండెం దొరబాబు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పవన్ కల్యాణ్‌ను తాజాగా కలిశారు. జనసేనలో చేరే అంశంపై చర్చించారు.వచ్చే వారంలో పెండెం దొరబాబు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం! రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!
పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!
బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?
రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..
చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..
ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!
రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: