LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
Politics

Dharmavaram Land Scam: బయటపడ్డ కేతిరెడ్డి భూ బాగోతం: 20 ఎకరాల చెరువు కబ్జాపై విచారణ వేగవంతం..!!

Dharmavaram Land Scam: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 20 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించి నిర్మించిన ఫామ్ హౌస్, గుర్రాల కోట వ్యవహారంలో తప్పుడు నివేదికలిచ్చిన ఇద్దరు ఎమ్మార్వోలకు సీఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేశార…

AndhraPravasi News Desk 2 min read
Dharmavaram Land Scam: బయటపడ్డ కేతిరెడ్డి భూ బాగోతం: 20 ఎకరాల చెరువు కబ్జాపై విచారణ వేగవంతం..!!

Dharmavaram Land Scam: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంచలనంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార బలంతో ధర్మవరం చెరువును ఆక్రమించి  నిర్మించిన భారీ ఫామ్ హౌస్, గుర్రాల కోట చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఈ అక్రమాలకు అప్పట్లో రెవెన్యూ అధికారులు కూడా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆయన పరం చేసేందుకు సహకరించారని విచారణలో తేలింది. ముఖ్యంగా నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో ఈ 'గుర్రాల కోట' వెనుక ఉన్న అసలు రంగును బయటపెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సుమారు 20 ఎకరాల ధర్మవరం చెరువు భూమిని ఆక్రమించి కేతిరెడ్డి అక్కడ విలాసవంతమైన ఫామ్ హౌస్, గుర్రాల కోసం ప్రత్యేక కోట, బోటింగ్ వంటి సౌకర్యాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. తుంపర్తికి చెందిన పరమేష్ అనే వ్యక్తి ఈ అక్రమ కట్టడాలపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది. చెరువు భూమిని కబ్జా చేసి పర్యావరణానికి విఘాతం కలిగించారని, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆధారాలతో సహా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వివరించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆక్రమణలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ భూ కుంభకోణంలో కేతిరెడ్డికి అండగా నిలిచిన రెవెన్యూ అధికారులపై ఇప్పుడు ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. అప్పట్లో పనిచేసిన ఎమ్మార్వో యుగేశ్వరీదేవి వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని తేలింది. కేతిరెడ్డి నిర్మించిన ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 661లో (చెరువు భూమి) ఉన్నప్పటికీ, అది సర్వే నెంబర్ 904లో ఉందని ఆమె రికార్డుల్లో తప్పుగా చూపించారు. ఇలా ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చిత్రీకరించి ఎమ్మెల్యే అక్రమాలకు ఆమె పూర్తిస్థాయిలో సహకరించారని విచారణలో వెల్లడైంది.

మరోవైపు, ఎమ్మార్వో నీలకంఠారెడ్డి కూడా నిబంధనలను తుంగలో తొక్కి కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు మేలు చేశారని అధికారులు గుర్తించారు. ఆఫీసు రికార్డులను కనీసం సరిచూసుకోకుండానే, కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో సుమారు 2.42 ఎకరాల అసైన్డ్ భూమిని వెబ్ ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇలా అర్హత లేని వ్యక్తులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యం వహించి, తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు గాను సి.ఎస్ సాయిప్రసాద్ ఆ ఇద్దరు ఎమ్మార్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ప్రస్తుతం ఈ భూ ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వం 10 రోజుల గడువు ఇచ్చింది. అక్రమంగా నిర్మించిన ఆ గుర్రాల కోటపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, వారికి సహకరించిన రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వివాదం చివరకు కేతిరెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేతకు దారితీస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…