LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
Politics

Telangana News: తుపాకీ వీడి.. ప్రగతి వైపు... అడవిని వీడి జనజీవన స్రవంతిలోకి 124 మంది మావోయిస్టుల..!!

Telangana Maoists Surrender: తెలంగాణలో శాంతి సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో 124 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి. 70 ఆయుధాల అప్పగింత. నవ తెలంగాణ దిశగా అడుగులు..

AndhraPravasi News Desk 1 min read
Telangana News: తుపాకీ వీడి.. ప్రగతి వైపు... అడవిని వీడి జనజీవన స్రవంతిలోకి 124 మంది మావోయిస్టుల..!!

Telangana Maoists Surrender: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అడవి బాట పట్టిన సోదరులను జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి భారీ స్పందన లభించింది. ఏకంగా 124 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి, ప్రజాస్వామ్య మార్గంలో నడవాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇది ఒక శుభపరిణామం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికత, పోలీసు యంత్రాంగం పట్ల నమ్మకంతో దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ (PLGA) కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరంతా సుమారు 70 అత్యాధునిక ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి, శాంతి వైపు అడుగులు వేయడం హర్షించదగ్గ విషయం. ఇది రేవంత్ సర్కార్ చేపట్టిన సంక్షేమ  అభివృద్ధి కార్యక్రమాల పట్ల పెరిగిన విశ్వాసానికి నిదర్శనం.

ఈ చారిత్రాత్మక లొంగుబాటు ప్రక్రియను పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి స్వయంగా అక్కడకు విచ్చేసి, లొంగిపోయిన వారికి స్వాగతం పలికి, వారితో మాట్లాడనున్నారు. శాంతియుత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించనున్నారు.

అడవిని వీడి వచ్చిన ఈ 124 మందికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీలు అందనున్నాయి. వీరు సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు అవసరమైన ఆర్థిక సాయం, ఇళ్ల స్థలాలు  పిల్లల చదువుల విషయంలో సీఎం గారు హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇకపై అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, ప్రజలందరూ ప్రశాంతంగా జీవించవచ్చని భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…