వైఎస్ఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం కాకరేపుతోంది. ఈ క్రమంలోనే జమ్మలమడుగు శాసనసభ్యుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో తనది తప్పుందని తేలితే.. రాజకీయాల నుంచి వైదొలగుతానంటూ ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైసీపీకి వత్తాసు పలుకుతోందని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. అందుకే స్థానికుల పక్షాన తాను పోరాడుతున్నట్లు ఆదినారాయణరెడ్డి వివరించారు. సిమెంట్ ఫ్యాక్టరీల యజమానులపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు త్వరలోనే ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు సిమెంట్ ఫ్యాక్టరీలపై జులుం ప్రదర్శిస్తున్నారంటూ ఆదినారాయణరెడ్డిపై ఇటీవలి కాలంలో విమర్శలు వస్తన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలకు అవసరమైన ముడిసరుకు సరఫరా కాంట్రాక్టులతో పాటుగా అన్ని కాంట్రాక్టులూ తనకే ఇవ్వాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: ఈ జిల్లా ప్రజలకు భారీ శుభవార్త.. ఎంపీ నిరంతర కృషికి ఫలితం! ఈ సేవ త్వరలోనే అమలులోకి..
అయితే స్థానికుల తరుఫున పోరాడుతున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి చెప్తున్నారు. తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆదినారాయణ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల, చిలమకూరుల్లో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఈ సిమెంట్ యూనిట్లు గతంలో ఇండియా సిమెంట్స్ అధీనంలో ఉండేవి. వీటిని అల్ట్రాటెక్ సంస్థ కొనుగోలు చేసింది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ యూనిట్లు అల్ట్రాటెక్ సంస్థ అధీనంలోకి వెళ్లాయి. అయితే ఈ యూనిట్లకు అవసరమైన ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా జరగకుండా ఇటీవల ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లైయాష్‌ను ఈ ఫ్యాక్టరీ యూనిట్లకు లారీల ద్వారా రవాణా చేస్తుంటారు. అయితే ఈ లారీలను ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకోవటం వివాదాస్పదమైంది. ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా నిలిపిపోవటంతో చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ఎర్రగుంట్ల ప్లాంట్‌లో కూడా ముడిసరుకు నిండుకోవటంతో సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఫ్లైయాష్‌కు సంబంధించి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డికి కూడా గతంలో విభేధాలు తలెత్తాయి. చివరకు సీఎం చంద్రబాబు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: