వైసీపీ తరపున ఎంపీగా గెలుపొంది ఆ పార్టీ అధినేత జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుది. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏపీలో ఎవరూ సాహసించని సమయంలో ఆయనను రఘురామ ఢీకొన్నారు. వైసీపీలోనే ఉంటూ జగన్ పై, ఆ పార్టీలోని కీలక నేతలపై యుద్ధమే చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో రఘురామ మాట్లాడుతూ... జగన్ తో తనకు విభేదాలు ఎందుకొచ్చాయో వెల్లడించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్ల వైసీపీ నేతలు చులకనగా మాట్లాడేవారని... అలా మాట్లాడటాన్ని తాను విభేదించడం వల్ల జగన్ తో తనకు తొలుత మనస్పర్థలు వచ్చాయని రఘురామ తెలిపారు. ఆ తర్వాత విభేదాలు ముదిరాయని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని... తాను రాజకీయాల్లోకి రాకముందే ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని తెలిపారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో జరిగిన ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ ల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: