ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసు లో SIT అధికారులు దూసుకెళ్తున్నారు. ఒకదానితో ఒకటి కేసులు నమోదు చేస్తూ, నిందితులను వరుసగా అరెస్ట్ చేస్తుండటం కలకలం రేపుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (YSRCP MP Mithun Reddy)ని అరెస్ట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించారు.
ఇకపోతే, టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ (TDP MLA Jyotula Nehru) ఈ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారని బాంబు పేల్చారు. మిథున్ రెడ్డిపై చట్టం తనదైన మార్గంలో ముందుకు సాగుతోందని చెప్పారు.
రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో వాటాలు అగిపోవడంతో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తప్పుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) కీలక పాత్రలో ఉన్నారని తెలిపారు. మద్యం పాలసీని ఆమోదించిన కేబినెట్ సభ్యులందరినీ విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.