ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి (YSRCP MP Mithun Reddy) ని పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. విజయవాడ (Vijayawada) ఏసీబీ (ACB) కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
రాజమండ్రి జైలు (Rajahmundry Jail)కు మిథున్రెడ్డిని తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరుగా వాహనంలోనే జైలు లోపలికి తీసుకెళ్లిపోయారు.
దీంతో పార్టీ శ్రేణులు క్రమంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. మిథున్రెడ్డిని శనివారం అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఇవాళ (Today) విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బీపీ (BP), షుగర్, ఈసీజీ (ECG) వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో అధికారులు ఆయన్ను ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. మిథున్రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్విత్ 34, 37, ప్రివెన్షన్ ఆప్ కరెప్షన్ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.