జిల్లాలో స్మార్ట్ మీటర్ల (smart meter) అమలుపై ప్రజల్లో ఉన్న సందేహాలను చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో గుంటూరు (Guntur) జిల్లాలో స్మార్ట్ మీటర్ల పనితీరు, స్థాపన పద్ధతులపై సమగ్రంగా సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తెనాలి నియోజకవర్గాల్లో పర్యటించి ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి రమేశ్ మాట్లాడుతూ, ప్రజల్లో స్మార్ట్ మీటర్లపై వ్యాపిస్తున్న అపోహలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు. "ఈ స్మార్ట్ మీటర్లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఖచ్చితంగా పని చేస్తాయి. బిల్లు (bill ) ఎక్కువగా వస్తుందన్న భావన వాస్తవానికి దూరమైనది," అని ఆయన వివరించారు.
ఇదే సందర్భంగా ఆయన మరో కీలక అంశాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్మార్ట్ మీటర్లకు ప్రీపెయిడ్ విధానం వర్తించదని, ఇప్పట్లో ఆ విధానం అమల్లోకి వచ్చే అవకాశమేమీ లేదని తెలిపారు. వినియోగదారులు బిల్లుల విషయంలో ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అంతేగాక, స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా రూపొందించబడ్డాయని, వీటి ద్వారా రోజువారీ విద్యుత్ వినియోగాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పని చేస్తుందని, ఎలాంటి మోసాలు జరగకుండా చూడడమే దీని ప్రధాన ఉద్దేశమని అన్నారు.
ప్రజల్లో (peoples) స్పష్టత తీసుకొచ్చేందుకు అధికారుల పర్యటనలు కొనసాగుతాయని, అవసరమైతే అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తామని తెలిపారు.