నేటి సమాజంలో కాలుష్యం అధికమవుతున్న కారణంగా పౌష్టికమైన ఆహారం సరైన విధంగా తీసుకోలేకపోతున్నాం. చాలా చిన్న వయసులోనే గుండెపోటు వంటి సమస్యలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల వార్తల్లో తరచూ చూస్తున్నాం. చిన్నపిల్లల నుండి పెద్దవారివరకు, ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా, ఏ ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవడానికి చాలా మంది సోషల్ మీడియా లేదా పుస్తకాల ద్వారా చదువుతూ నేర్చుకుంటున్నారు.
కాలానికి అనుగుణంగా నట్స్‌కి (గింజల వర్గానికి) మంచి ప్రాధాన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్యకరమైన ఆహారానికి వెచ్చించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్దవారివరకు, నట్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు. బాదం (Almonds) మరియు వాల్నట్స్ (Walnuts) రెండూ మనకు అత్యంత పౌష్టికమైన విత్తనాలు. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ కలిగిన సూపర్‌ఫుడ్స్‌గా పరిగణించబడతాయి. కానీ వీటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది? ఏది ఎప్పుడు తినడం మంచిది? ఇప్పుడు వాటి మధ్య తేడాలు, ప్రయోజనాలు చూద్దాం.
బాదం (Almonds)
బాదం లో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది → చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది.
మాగ్నీషియం ఎక్కువ → నరాలు, ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.
ప్రోటీన్, ఫైబర్ అధికం → బరువు నియంత్రణలో సహాయం.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. పొట్ట నిండిన భావన కాలిగిస్తుంది, చర్మం మెరిసేలా, జుట్టు బలంగా మారేలా చేస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు, చర్మం–జుట్టు ఆరోగ్యం కాపాడుకోవాలనుకునే వారు బాదం తినవచ్చు.అతిగా తీసుకోకపోవడం మంచింది.
వాల్నట్స్ (Walnuts):
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం → గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు ముఖ్యమైనది. చిన్న పిల్లలకు ఇవి ఇవ్వడం ద్వారా వారి IQ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ → వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయం. విటమిన్ B6, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి “బ్రెయిన్ ఫుడ్” గా ప్రసిద్ధి.
గుండెపోటు, హై బ్లడ్ ప్రెజర్ సమస్యలు తగ్గించే అవకాశం ఉంటుంది ఆదేవిధంగా శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. నిద్ర బాగా పట్టేందుకు మెలటోనిన్ సహాయపడుతూంది గుండె, మెదడు ఆరోగ్యం, వృద్ధాప్యం ఆలస్యం కావాలని కోరుకునే వారు వాల్నట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.
రోజుకు ఎంత తినాలి?
బాదం: రోజుకు 6–8 గింజలు
వాల్నట్స్: రోజుకు 2–3 గింజలు తీసుకోవడం మంచింది అని చెపుతున్నారు.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే వీటిని సేవించే ముందు మీ డాక్టర్ ను సంప్రదించి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.