ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, నంద్యాల, ఖమ్మం, కృష్ణా, నందివాడ జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాల‌లో భూసేకరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ మీదుగా నాగ్‌పూర్ వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు(Greenfield Highway Project)కి ఇప్ప‌టికే అనుమ‌తి వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనులు జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ ఆలస్యమవుతోంది. ఇంకా పనులు ప్రారంభంకాలేదు. భూసేకరణలో జాప్యం కారణంగా ఏడాది కిందటే ప్రారంభం కావాల్సిన పనులు ఇంకా మొదలు కాలేదు.

భూసేకరణ ఆలస్యం అవుతుందని.. ముందుగా బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రారంభించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులో విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా మంచిర్యాల వరకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉంటుంది. ఆ తర్వాత మంచిర్యాల నుంచి నాగ్‌పూర్ (Nagpur) వరకు ఉన్న హైవే నిర్మాణం జరప‌నున్నారు. అయితే విజయవాడ నుంచి ఖమ్మం వరకు 90 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుంది.


ఇది కూడా చదవండి: Real estate: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. కీలక ప్రణాళికలు సిద్ధం, కొన్ని మండలాల్లో!

ఇది ఖమ్మం (Khammam) జిల్లా సరిహద్దు నుంచి విజయవాడ బైపాస్‌లోని జక్కంపూడి దగ్గర కలుస్తుంది. ఈ 90 కిలో మీటర్ల హైవే పనుల్ని మూడు భాగాలుగా విభజించారు.. మొదటి రెండు భాగాలు ఖమ్మం జిల్లాలో ఉంటే.. అక్కడ ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మూడో భాగమైన ఎన్టీఆర్ జిల్లాలో 29 కిలోమీటర్లకు సంబంధించి అవసరమైన భూసేకరణ మాత్రం జరగడం లేదు.

ఎన్టీఆర్(NTR District) జిల్లా పరిధిలో ఈ హైవే కోసం 134 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 12.17 హెక్టార్ల పట్టా భూములు, 9.24 హెక్టార్ల అసైన్డ్ భూములు సేకరించలేదు. అలాగే 13.25 హెక్టార్ల ప్రభుత్వ భూములను అప్పగించలేదు. ఈ భూముల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏడాదిన్నర కిందటే రూ.220 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ వెంటనే ఎన్టీఆర్ జిల్లా జేసీ నిధి మీనా భూసేకరణ పనులు వేగవంతం చేశారు. ఆ తర్వాత ఆమె సెలవుపై వెళ్లడంతో భూసేకరణ ఆగిపోయింది.

అయితే నేషనల్ హైవే(National Highway)కు సంబంధించి 90శాతం భూసేకరణ పూర్తి చేస్తేనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ హైవేకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేసి అప్పగిస్తే రెండేళ్లలో పనులు పూర్తి చేయొచ్చు అంటున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

Road Development: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! రూ.800 కోట్లతో.. 4 వరుసలుగా

Operation Sindhu: ఆపరేషన్ సింధు షురూ! ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు!

Tirumala Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! ఇకపై అక్కడ నో లేట్...

AP Politics: వైసీపీకి దిమ్మ తిరిగే షాక్.. వారిపై కేసులు నమోదు! కారణం ఏమిటంటే?

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

Aadhaar Update: ఇంటి నుండే ఆధార్ అప్ డేట్! సెంటర్ కి వెళ్లే పని లేదు ...ఇలా చేసేయండి!

Modi Cabinet: మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు! చంద్రబాబు ఛాయిస్, పవన్ సైతం!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group