విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మెట్రోను డబుల్ డెక్కర్ తరహాలో నిర్మించాలని యోచిస్తోంది. దీని కోసం ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్ (AIIB) రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాజెక్టులో మెట్రో మార్గం మరియు ఫ్లైఓవర్లను ఒకేసారి నిర్మించాలన్న యోచనతో, స్థలం మరియు ఖర్చు పరంగా లాభపడేలా డబుల్ డెక్కర్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి కన్సల్టెంట్‌ను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) మరియు ఏపీ మెట్రో కార్పొరేషన్ కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ ప్రాజెక్టులో మొత్తం 140.13 కి.మీ మేర మెట్రో నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి దశలో మధురవాడ–తాటిచెట్లపాలెం, గాజువాక–స్టీల్‌ప్లాంట్ కారిడార్లలో 46.23 కి.మీ మార్గం ఉండగా, అందులో 20.16 కి.మీ మేర డబుల్ డెక్కర్ ట్రాక్‌గా ప్లాన్ చేశారు. ఇందులో రోడ్డుకు పైగా ఫ్లైఓవర్, దానిపై మెట్రో ట్రాక్ ఉండనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఇటీవలే మెట్రో కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో కలిసి AIIB ప్రతినిధులు ప్రాజెక్ట్ స్థలాలను సందర్శించి రుణాలపై చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!
తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...
కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: