ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ప్రముఖ ప్రాంతాలను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. "రామాయణ ట్రైల్ ఆఫ్ శ్రీలంక" పేరిట అందిస్తున్న ఈ ప్రత్యేక విమాన ప్యాకేజీ జూన్ 28 నుంచి జూలై 3 వరకు, ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ద్వారా కొలంబో, దంబుల్ల, కాండీ, నువారా ఎలియా, మునీశ్వరం ఆలయం, మనవారి ఆలయం, అశోక వాటిక, సీతా ఎలియా, రాంబోడ సీతా అమ్మన్ ఆలయం, పంచముఖ ఆంజనేయ ఆలయం, శ్రీ భక్త హనుమాన్ ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ ఆలయం, కేలానియా బౌద్ధ ఆలయం వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు.
ఈ ప్యాకేజీ లోపల విమాన ప్రయాణం, హోటల్ వసతి, దేవాలయాల్లో ప్రవేశ రుసుములు వంటి సౌకర్యాలు అందించబడతాయి. టికెట్ ధరలు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 89,845, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 69,450, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 68,840గా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక, విహారయాత్రలో పాల్గొనదలచిన వారు మరిన్ని వివరాల కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో గేట్ నంబర్ 1 వద్ద ఉన్న IRCTC కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా [www.irctctourism.com](http://www.irctctourism.com) వెబ్‌సైట్‌లో లాగిన్ అయి బుకింగ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: