బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులు త్వరలోనే ప్రారంభం. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసులు త్వరలో మొదలుకానున్నాయి. ఈ తరగతులు ప్రారంభించుకునే తుది గడువును అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఇప్పటికే తెలంగాణలో ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగియగా, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రోజు (ఆగస్టు 18) నుంచి, మరికొన్ని ఆగస్టు 25 నుంచి ఓరియంటేషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నాయి.
బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు సగం సగం సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిసిందే. అయితే బీఫార్మసీ కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) అనుమతులు ఇంకా రాకపోవడంతో బయోటెక్నాలజీ, బీఫార్మసీ సీట్ల భర్తీ నిలిచిపోయింది. అనుమతులు రాగానే ఈ ప్రక్రియ మొదలవుతుంది.
ఇక ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థులకు బ్రాంచ్ మార్పు కోసం ఆగస్టు 18, 19న ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. వీరికి ఆగస్టు 22లోపు సీట్లు కేటాయించనున్నారు.