Header Banner

ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

  Wed May 21, 2025 12:16        Politics

ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) ప్రభుత్వం అమరావతిలో పనుల్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు మూడో దశ పనులు త్వరలో మొదలు కానున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుండి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.5 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. ఈ మేరకు దీని కోసం రూ.593.03 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఈ రోడ్డు మణిపాల్ ఆసుపత్రి దగ్గర చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేను కనెక్ట్ చేయనుంది. ఏడీసీ (Amaravati Development Corporation) ఈ రోడ్డు కోసం టెండర్లు పిలవనుంది. ఈ మేరకు ఇక్కడ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మిస్తారు. మూడో దశ రహదారి ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి పాత మద్రాసు రహదారి మీదుగా వెళుతుంది. ఈ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు మార్గంలో ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి(Cable bridge)ని కూడా నిర్మించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. 320 మీటర్ల కేబుల్ బ్రిడ్జి(Cable bridge) నిర్మాణం కోసం 48 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ రహదారిని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేతో కలిపే చోట మూడు ర్యాంప్‌లను నిర్మిస్తారు. అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లడానికి 232 మీటర్ల ర్యాంప్ ఉంటుంది. గుంటూరు నుంచి అమరావతి వైపు వెళ్లడానికి 280 మీటర్ల ర్యాంప్ ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్! అలా చేస్తే రూ.10 లక్షల జరిమానా!

 

విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్ళడానికి 115 మీటర్ల ర్యాంప్ ఉంటుంది. అలాగే 1. 52 కి.మీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. పాత మద్రాసు రోడ్డులో బకింగ్‌హాం కెనాల్‌పై ప్రస్తుతం ఉన్న ఆర్చ్ బ్రిడ్జి మీదుగా 320 మీటర్ల పొడవైన ఎక్స్‌ట్రా డోస్డ్ బ్రిడ్జి (Cable bridge) నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌లో భాగంగానే 99.6 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి కూడా ఉంటుంది. అంతేకాదు ఈ రోడ్డులో మరో మేజర్ బ్రిడ్జి, రెండు మూడు వెహికిల్ అండర్ పాస్‌లు కూడా నిర్మించనున్నారు. అమరావతిలో 21.7 కిమీ పొడవున సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు ఉంది. మొదటి దశలో దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 2019కి ముందే అప్పటి టీడీపీ ప్రభుత్వం 14 కి.మీ మేర రోడ్డు పూర్తి చేసింది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 4.2 కి.మీ. రహదారి నిర్మాణం భూ సేకరణ సమస్యల కారణంగా ఆగిపోయింది. ఈ క్రమంలో రాజధాని పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కి.మీ. రహదారి నిర్మాణ పనులను (Seed Access Road Phase 2) చేపట్టింది. అయితే ఈ రోడ్డుకు సంబంధించిన భూసేకరణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నా.. ఓ వైపు పనులు చేస్తూనే రైతులతో అధికారులు మాట్లాడుతున్నారు. ఈ రోడ్డు మొత్తం 4.2 కి.మీ.లో 1.5 కి.మీ. పనులు మొదలుపెట్టారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations