దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో శుక్రవారం దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సదరం సర్టిఫికెట్లు, పీఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్‌పై మంత్రి చర్చించారు.
ఇది కూడా చదవండి: జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్‌కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పీఎంజేఎవై వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!
ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్ లేకపోతే!
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: