LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Godfrey Phillips India: ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం..

Godfrey Phillips India: ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని ప్రముఖ పొగాకు గ్రేడింగ్ సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా కంపెనీలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

AndhraPravasi News Desk 1 min read
Godfrey Phillips India: ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం..
  • గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా పొగాకు కంపెనీలో చెలరేగిన మంటలు..
     
  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా..

Godfrey Phillips India: ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని ప్రముఖ పొగాకు గ్రేడింగ్ సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా కంపెనీలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. 

కంపెనీలోని పొగాకు గ్రేడింగ్ యూనిట్‌లో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే కంపెనీ యాజమాన్యం అగ్నిమాపక, పోలీస్ శాఖలకు తెలియజేసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇతర గిడ్డంగులకు మంటలు వ్యాపించకుండా నిరోధించగలిగారు. 

విద్యుత్ సరఫరాలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 2,000కు పైగా పొగాకు బేళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…