యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొన్ని దేశాల వారికి 'జీవితకాల గోల్డెన్ వీసా' మంజూరు చేస్తోందంటూ ప్రచారంలో ఉన్న వార్తలను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసీపీ) స్పష్టం చేసింది. యూఏఈలో నివసించాలనే ప్రజల ఆశలను, ఆశయాలను ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు చేస్తున్న మోసపూరిత ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Eligible Farmers: అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ లిస్ట్ వచ్చేసింది! అర్హులు వీరే... వెంటనే ఇలా చెక్ చేసుకోండి!
విదేశాలకు చెందిన ఓ కన్సల్టింగ్ కార్యాలయం, కొన్ని మీడియా సంస్థలు ఈ తప్పుడు వార్తలను ప్రచురించినట్లు ఐసీపీ గుర్తించింది. యూఏఈ ప్రభుత్వంతో సంబంధం లేని ఏ ప్రైవేట్ ఏజెన్సీ లేదా కన్సల్టెన్సీకి గోల్డెన్ వీసా దరఖాస్తులను స్వీకరించే అధికారం లేదని అధికారులు తేల్చిచెప్పారు. గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!
యూఏఈ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే గోల్డెన్ వీసా కేటగిరీలు, వాటికి ఉండాల్సిన అర్హతలను నిర్ణయిస్తారని ఐసీపీ వివరించింది. రియల్ ఎస్టేట్‌లో 2 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడి పెట్టడం, వ్యాపార యజమానులుగా ఉండటం, లేదా సైన్స్, కళలు, క్రీడలు వంటి రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబరచడం వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వం గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తుంది. నామినేషన్ల ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా ప్రభుత్వమే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Farmers Relief: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా.. చెక్ చేసుకోండి!
కొంత ఫీజు చెల్లిస్తే చాలు, గోల్డెన్ వీసా సులభంగా పొందవచ్చని కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని యూఏఈలో నివసించాలనుకునే, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఐసీపీ విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 600522222 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని కోరింది.
ఇది కూడా చదవండి: Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!
Bank strike: అలర్ట్.. రేపు బ్యాంకులు బంద్! కారణం ఇదే!
Free Bus: ఏపీలో ఉచిత బస్సు పై క్లారిటీ! చంద్రబాబు కీలక ప్రకటన!
Quantum technology: సిలికాన్ వ్యాలీ తర్వాత క్వాంటమ్ వ్యాలీ.. అమరావతిలో కొత్త అధ్యాయం!
Central Government: ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! వచ్చే నాలుగైదు నెలల్లో..!
Achchennaidu: ఏపీకి మూడు కొత్త బోర్డులు..! కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు కీలక వినతులు!
Formers: ఏపీలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..! అకౌంట్‌లలోకి డబ్బులు!
Reservation: మహిళలకు శుభవార్త! సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్!
Rs.7 Lakhs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షల డబ్బులు!
Atchannaidu Meeting: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు! ఏపీలో దాదాపుగా 64 శాతం..
Mobile Bills: మొబైల్ యూజర్లకు చేదువార్త.. రీఛార్జీలపై చార్జీల మోత! కొత్త రీఛార్జ్ ప్యాక్స్!
Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
Serious Illness: మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!
New Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్! రూ.150 కోట్లతో.. భూముల ధరలకు రెక్కలు!
Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!
Anna Canteen: మరో 70 అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఎక్కడెక్కడంటే ?
Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: