కాసేపట్లో మరో సూపర్ సిక్స్ హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణం మొదలుపెట్టనున్నారు.
ఈ బస్సు ఉండవల్లి సెంటర్, తాడేపల్లి మీదుగా విజయవాడ బస్టాండ్‌కు చేరుకుంటుంది. ప్రయాణ సమయంలో సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో ఉంటారు. సీఎం రాకకు మంగళగిరి నియోజకవర్గ మహిళలు ఘన స్వాగతం పలికేందుకు తరలివస్తున్నారు. పాయింట్‌లో కూడా టిడిపి కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.