అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం జరగనున్న అత్యంత కీలక సమావేశానికి అలస్కా, యాంకరేజ్ నగరాన్ని వేదికగా చేసుకున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ భేటీ ప్రకటించడంవల్ల ఏర్పాట్లు అత్యంత వేగంగా, యుద్ధపాతిపదికన సాగాయి. వందలాది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, భద్రతా సిబ్బందితో యాంకరేజ్ నగరం ఇప్పుడు ఒక అదుర్స్ శత్రు దుర్భేద్య కోటలా మారింది.
ప్రస్తుతం అలస్కాలో పర్యాటక సీజన్ కావడం వల్ల హోటళ్లు నిండిపోయి, అద్దెకు కార్లు దొరకకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. దీన్ని అధిగమించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కార్గో విమానాల్లో ప్రత్యేక వాహనాలు, కమ్యూనికేషన్ పరికరాలు, వైద్య సామాగ్రి తీసుకువచ్చారు. వందలాది ఏజెంట్లు, సిబ్బంది నగరంలో మోహరించబడ్డారు.
ఈ శిఖరాగ్ర సమావేశం యాంకరేజ్‌లోని “జాయింట్ బేస్ ఎల్మెన్‌డార్ఫ్-రిచర్డ్‌సన్” అనే అతిపెద్ద సైనిక స్థావరంలో జరగనుంది. సైనిక స్థావరానికి పటిష్ట భద్రత, నియంత్రిత గగనతలం ఉండటంతో, ప్రజలకు ప్రవేశం లేకపోవడం భద్రతా అంశాల కోసం సహాయపడుతుంది. అలస్కా గవర్నర్ మైక్ డన్లీవీ తెలిపినట్లు, “పర్యాటక సీజన్ లో హోటళ్లు, వాహన కొరతల సమస్యను సైనిక స్థావరం పరిష్కరించింది” అని అన్నారు.
భద్రతా ఏర్పాట్లు అత్యంత కఠినంగా ఉన్నాయి. అమెరికా, రష్యా భద్రతా సిబ్బందులు తమ తమ నాయకులను రక్షిస్తారు. ఒకరి తలుపు మరొకరు తెరవరు, వాహనాల్లో ఒకరు ప్రయాణించరు అని అధికారులు స్పష్టంగా తెలిపారు. ప్రతీ విషయంలో గన్‌కు గన్, ఏజెంట్‌కు ఏజెంట్ విధంగా సమానత్వం పాటిస్తారు.

ఈ సమావేశం కారణంగా స్థానిక Realtors కూడా విభిన్నంగా స్పందించారు. యాంకరేజ్‌లోని బ్యూ డిస్బ్రోకి మొదట అమెరికా సీక్రెట్ సర్వీస్, ఆ తరువాత రష్యా కాన్సులేట్ నుండి ఇళ్ల కోసం ఫోన్లు రావడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి, భూభాగాల మార్పిడి, అంతర్జాతీయ సంబంధాల బలోపేతం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రావచ్చని ట్రంప్ పేర్కొన్నారు.