ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఇంటి యజమానులకు మంచినీటి కనెక్షన్ ఫీజుపై భారీ రాయితీ కల్పించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న కనెక్షన్ ఛార్జీలకు 50 శాతం డిస్కౌంట్ లభించనుంది.
ఎవరికి వర్తిస్తుందంటే..? ఈ రాయితీ పథకం కింద, 2025, ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకూ ఇంటి యజమానులు వాడే గృహ జల సరఫరా కనెక్షన్ ఫీజుపై 50 శాతం మినహాయింపు వర్తించనుంది.
దీంతోపాటు, ఇప్పటికీ కనెక్షన్ తీసుకోని ఇంటికి 20 మిమీ డైమీటర్ వాటర్ కనెక్షన్ పొందాలంటే రూ.6,000 చెల్లించాల్సిన అవసరం ఉండేది. ఇకపై ఈ నిర్ణయంతో రూ.3,000కే ఇది అందుబాటులోకి రానుంది.
ప్రయోజనం ఎలా పొందాలి..? సిటీటౌన్ మున్సిపాలిటీ లేదా సంబంధిత మునిసిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ పథకంలో భాగమవ్వొచ్చు. తాగునీటి కనెక్షన్ పొందాలనుకునే వారు తక్షణమే ముందంజ వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.